పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతి నిది జనవరి 13 ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27 న నిర్వహించిన ఈ.ఈ.ఎం.టి 2026 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఆదివారం సంస్థ కన్వీనర్ శ్రీపుట్టంరాజు, శ్రీరామచంద్ర మూర్తి అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో 7వ తరగతి నుంచి 30 మంది, 10వ తరగతి నుంచి 56 మంది విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారని తెలిపారు. 10 వ తరగతి విభాగం లో టెక్కలి మండలం సీతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధి సకలభక్తుల భరత్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ్మినేని పద్మావతి తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్.ఎం, ఉపాధ్యాయులు భరత్ ను అభినందించారు. ఈ విజేతకు ఫిబ్రవరి 1, 2026న విజయవాడ గవర్నర్ పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నగదు బహుమతి 30,000, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
