సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి ‘ రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం’ ప్రధానం.

పయనించే సూర్యుడు జనవరి 13 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో విశిష్ట సేవలు గుర్తించి వారికి ‘ రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం’ ప్రధానం చేశారు. మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఈ యొక్క అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో .. పలు సంస్థల వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ మరియు అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ గ్రహీత కదరి వెంకటరమణరావు, ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మరియు డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, ఫిలిం ఆర్టిస్టు ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్ లు శాలువా కప్పి, సర్వోత్తమ సేవా పురస్కారం అవార్డును ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఈ కార్యక్రమంకు వచ్చిన ముఖ్య అతిథి కోలేటి దామోదర్ గుప్తా, దైవజ్ఞ శర్మ, డాక్టర్ శివ నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ… గత 30 సంవత్సరాలుగా మండల యాదగిరి పత్రికా రంగంలో అందిస్తున్న నిస్వార్ధ, సామాజిక సేవలు వెలకట్టలేనివన్నారు. వృత్తి పరంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సమాజ శ్రేయస్సే లక్ష్యంగా 30 ఏళ్లుగా ఇలాంటి స్వార్ధాన్ని ఆశించకుండా నిస్వార్ధంగా సేవా దృక్పథాన్నే పరమార్థంగా భావించి తమ వంతు పాత్ర సమర్థవంతంగా పోషించి సమాజ సేవలో భాగస్వాములై ఆదర్శప్రాయంగా నిలుస్తున్నందుకు ఆయనను రాష్ట్రస్థాయి అవార్డుతో సత్కరించడం గర్వంగా ఉందన్నారు. మానవతా విలువలు పెంపొందించే దిశగా అహర్నిశలు కృషి చేయాలని నిరంతర సేవా తత్పరులుగా మారాలని ఆకాంక్షించారు. యాదగిరి ఇలాగే జర్నలిస్టుగా మరిన్ని ఏళ్లపాటు సేవలందించి ప్రజలు ప్రభుత్వం చే గుర్తింపు పొంది మరెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందాలని ఆకాంక్షించారు. పత్రికా రంగంలో పాతికేళ్లకు పైగా సేవ చేసే ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం జీవనోపాధి, ఆర్థిక సహాయం కల్పించాలని ఈ సందర్భంగా అతిథులు సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *