
పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని రూరల్ రిపోర్టర్ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా, జనవరి 18న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా, ఆదోని పట్టణంలో జనవరి 16న ర్యాలీ మరియు పబ్లిక్ మీటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శిలు కే రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అంటించేందుకు వీలుగా రూపొందించిన స్టిక్కర్లను విడుదల చేశారు. ఈ స్టిక్కర్ల ద్వారా ప్రజల్లో సీపీఐ వందేళ్ల చరిత్ర, ప్రజా పోరాటాల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఖమ్మం సభను విజయవంతం చేయడానికి మద్దతు సమీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికులు, రైతులు, యువత, ప్రజల హక్కుల కోసం వందేళ్లుగా సీపీఐ సాగిస్తున్న పోరాటాలకు గుర్తింపుగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద సంఖ్యలోతరలి రావాలని, అలాగే ఆదోనిలో జరగనున్న జనవరి 16 ర్యాలీ, పబ్లిక్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాయ్ వైఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ శాఖ కార్యదర్శి విజయ్ ఆటో యూనియన్ నాయకులు నరసింహులు శ్రీరాములు భాష షేక్షావలి నాగరాజు వరప్రసాద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.