సేవాలాల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

* కార్యక్రమంలో మండల ఎస్టీ సర్పంచులు పాల్గొన్నారు

పయనించే సూర్యుడు జనవరి 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, అలాగే లట్టుపల్లి తాండాల సహకారంతో సేవాలాల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూడవత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ, పండుగల సందర్భంలో యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచి, క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడల ద్వారా యువతకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్‌లో విజేత జట్టుకు మొదటి బహుమతిగా రూ.30,000లు, రన్నర్‌అప్ జట్టుకు రూ.20,000లు బహుమతులుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్న పీర్ తాండ సర్పంచ్ మునిందర్ నాయక్, నక్కల చెరువు తాండ సర్పంచ్ పాండు నాయక్, మీట్యా తాండ సర్పంచ్ ఫూల్య నాయక్, చందూలాల్ నాయక్, రవి నాయక్, కృష్ణా నాయక్‌తో పాటు పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *