పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ -13 రామగిరి మండలం సెంటనరీ కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు ములుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికా దేశంలో సర్వమత సమ్మేళనం జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ అందులో పాల్గొన్నవి భారతదేశం తరఫున స్వామి వివేకానంద సనాతన ధర్మం గురించి హిందూ సాంప్రదాయాల గురించి చెప్పి భారతదేశం గొప్పతనం విలువలు మన సాంప్రదాయ సంస్కృతి నువ్వు చెప్పి వారి మన్ననాలు పొంది ప్రపంచంలోనే భారతదేశం అఖండ దేశంగా వెలుగుతుందని ఆ యొక్క సమావేశంలో పాల్గొన్న వివిధ మతాల సభ్యులందరికీ వివరించడం జరిగింది. అప్పుడు అందరూ స్వామి వివేకానంద గురించి తెలుసుకొని ఆయన మాటలకు మంత్రముగ్ధులే హర్ష ధాన్యాలు చేశారు అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి వ్యవస్థాపకుడు దుంతుల సురేష్ పాల్గొన్నారు.