స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా

పయనించే సూర్యుడు 13-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సామాజిక వేత్త జాతీయ విశ్వకర్మ అవార్డు గ్రహీత డా. తాడూరి వంశీ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం గొల్లపెల్లి లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు. ముఖ్య అతిధి ఆర్ ఎస్ ఎస్ ప్రముఖ్ రమేష్, విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి యువత ఆదర్శం తీసుకోని జీవితం లో ముందుకు వెళ్ళాలి దేశ అభివృద్ధి లో పాలు పంచుకోవాలి అని పేర్కొన్నారు. లీడ్ ఇండియా స్టేట్ భాద్యులు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంది అని ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కావద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో కట్ట మహేష్, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు చెవులమాద్ది శేఖర్, శ్రీకోఠి నిలకంఠ, శాతల్ల లక్ష్మణ్, వార్డు మెంబర్ ఆవుల రాజశేఖర్, దేవరకొండ కరుణాకర్, గంగరాజాం,ప్రణయ్,దీపక్, అజయ్ గ్రామ యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.