హుజురాబాద్ గడ్డపై సింహం గుర్తు జెండా ఎగురవేస్తాం

★ ప్రధాన పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్న సింహం గుర్తు.కొలుగూరి సూర్యకిరణ్

పయనించే సూర్యుడు: జనవరి 13 :హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి: రానున్న మున్సిపల్ ఎన్నికలలో హుజురాబాద్ గడ్డపై సింహం గుర్తు జెండాను ఎగరవేస్తామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ అన్నారు. నేతాజీ,సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిందని గత మున్సిపల్, నగరపాలక కార్పొరేట్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మంది కార్పోరేటర్ గా గెలుపొందారని, రామగుండం కార్పొరేషన్లు 9 మంది కార్పొరేటర్లు మరియు చొప్పదండిలో ఒకరు కరీంనగర్ కార్పొరేషన్ లో ముగ్గురు కార్పోరేటర్లు సింహం గుర్తు పై గెలిచారని తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు సింహం గుర్తు ముచ్చమటలు పట్టిస్తుందని అదే తరహాలో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో దేశ పునర్నిర్మాణం కోసం నేతాజీ, సుభాష్ చంద్రబోస్ ఆలోచన విధానం దేశానికి చాలా అవసరమని యువత విద్యావంతులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని కోరారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో శక్తిగా ఎదుగుతుందని దేశం కోసం నేతాజీ, సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా పనిచేశారొ నేతాజీ, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అదే తరహాలో ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు.