అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 తెలంగాణ ను పొందిన

★ కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 14 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమేడ రాజేశ్వర్ రావు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్ జొన్ నుండి జనవరి 8,9,10 రోజులలో నిర్వహించిన సదరన్ డెయిరి మరియు ఫుడ్ కాంక్లేవ్ 2026 ప్రోగ్రాంను కేరళ రాష్ట్రంలోని కాలికట్ ట్రెడ్ సెంటర్ నందు ప్రతిష్ఠాత్మక అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 తెలంగాణ ను కేరళ రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి జె. చించురాణి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడంలో సహకరించిన డెయిరీ సిబ్బందికి, పాడి రైతులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, తనకు ఉన్నతికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ పాలకవర్గ సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొనడం జరిగింది