పయనించే సూర్యుడు జనవరి 14 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 59వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఆదోని గంగపుత్రలు ఆదోని జిల్లా సాధన కమిటీకి మద్దతు తెలిపారు. గంగపుత్రులు బి హనుమంతరావు మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి ఏ స్పందన రాకపోవడంతో ఆదోని జిల్లా సాధించేంతవరకు మద్దతు తెలుపుతామని తెలిపారు. ఆదోని ఆలూరు పత్తికొండ మంత్రాలయం నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లాల్సి వస్తుందని, జిల్లా ఏర్పాటు అయితే ఈ వలసలు ఆగుతాయని వారు తెలిపారు రెండో ముంబై గా పేరుగాంచిన ఆదోని జిల్లా కాకపోవడం వల్ల అభివృద్ధిలో వెనుకబడి పోయిందని అన్నారు అత్యవసర వైద్యం విద్య పరిపాలన అవసరాల కోసం ప్రజలు కర్నూలుకు సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బి ప్రకాష్ గంగపుత్ర, పి దీపక్ బాబు గంగపుత్ర కుమార్ ఐఎఫ్టియు పాండురంగ సిపియుఎస్ఐ బొజ్జన్న సి పి యు ఎస్ ఐ సెక్షావాలిన్ జావిద్ మస్తాన్ సి పి యు ఎస్ ఐ సునాక జియా పాల్గొనడం జరిగింది.