కరీంనగర్ నగర పాలక సంస్థపైకాంగ్రెస్ జెండా ఎగరవేస్తాంఅన్ని రంగాల్లో కరీంనగర్ నుఅత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం

★ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 14 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ కాంగ్రెస్ నాయకులమంతా సమిష్టిగా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నూతన ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు స్పష్టం చేశారు కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి నగరపాలక సంస్థ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని శపథం చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్పష్టం చేశానని తెలిపారు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమితులై మొట్టమొదటిసారిగా మంగళవారం కరీంనగర్ వచ్చిన వెలిచాల రాజేందర్ రావు డిసిసి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అర్బన్ డిసిసి అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్ ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ కోడూరు సత్యనారాయణ గౌడ్ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా సమిష్టిగా రాబోయే మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పాటుపడతామని పేర్కొన్నారు మా మధ్య ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా తాను కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అధిష్టానం పెద్దలు అందించిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటానని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు దక్కుతాయని తెలిపారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు నాయకుల మంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శాయ శక్తుల కృషి చేస్తామని తెలిపారు తను నగర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని పేర్కొన్నారు మేనిఫెస్టోను ఒక భగవద్గీత లాగా భావిస్తూ కరీంనగర్ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాజేందర్ రావు స్పష్టం చేశారు కరీంనగర్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది రాష్ట్రంలోనే పర్యటక ప్రాంతంగా తయారు చేస్తామని తెలిపారు కరీంనగర్ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో మేనిఫెస్టోతో ముందుకు సాగుతున్నానని తెలిపారు కరీంనగర్లో బీఆర్ఎస్ బిజెపి ఆటలు ఇక సాగనివ్వమని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బిజెపి నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఒకరి గెలుపు కోసం మరొకరు సహాయపడుతున్నారని ఆరోపించారు వారి ఆగడాలను ప్రజలు గమనించారని వాటికి స్వస్తి పలికే రోజు అసన్నమైందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాజేందర్రావు పేర్కొన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అర్బన్ డిసిసి అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావుకు అభినందనలు తెలిపారు రాజేందర్ రావు తో కలిసి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కలిసికట్టుగా కాంగ్రెస్ విజయానికి పాటుపడతామని పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పటిష్టతకు అందరం కలిసిమెలిసి పని చేస్తామన్నారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ బీసీ మైనార్టీ సెల్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అడుగడుగునా వెలిచాల రాజేందర్ రావు కు జననీరాజనం అట్టహాసంగా స్వాగతం ఘనంగా సన్మానాలు వెల్లువెత్తిన అభిమానం వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అలుగునూర్ చౌరస్తా నుంచి గీత భవన్ చౌరస్తా వరకు రాజేందర్ రావు భారీ ర్యాలీ మహిళల మంగళ హారతులు బోనాలు డప్పు చప్పుళ్ళు.. ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్ ఆరేపల్లి మోహన్ నాయకులు ఊట్కూరు నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎండి తాజ్,మడుపు మోహన్ బానోతు శ్రావణ్ నాయక్ కొరివి అరుణ్ కుమార్ పులి ఆంజనేయులు గౌడ్ చర్ల పద్మ,వెన్నం రజిత రెడ్డి కుర్ర పోచయ్య దన్ను సింగ్ అబ్దుల్ రెహమాన్ కుంభాల రాజ్ కుమార్ పోరండ్ల రమేష్, విశాల్ కంకణాల అనిల్ కుమార్ మంద మహేష్, తోట అంజయ్య తదితరులు పాల్గొన్నారు