కలకొడిమ సర్పంచ్ సుమతీ భాయి, భాస్కర్ రావు దంపతులను సన్మానించిన డాక్టర్ ఆర్చ బిషప్ తిమోతి

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 14, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని కలకోడిమ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్ తాతా సుమతి బాయి, మాజీ జడ్పిటిసి, సీనియర్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తాతా భాస్కర్ రావు దంపతులను ఆర్చ బిషప్ డాక్టర్ దారెల్లి తిమోతి, ఇందిరా దంపతులు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. తిమోతి దంపతులు సుదీర్ఘ కాలం పాటు ఆ గ్రామంలో పాస్టర్ గా బోధన చేస్తూ గ్రామస్తులతో కలివిడిగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో నూతనంగా వారు సర్పంచిగా విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. వారు కూడా బిషఫ్ దంపతులకు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనుబోలు సుబ్బారావు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *