పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 14. మండలంలోని కస్తాల గ్రామంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు , యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం బీఅర్ఎస్ పార్టీ నాయకులు సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు దోటి శ్రీను మరియు బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .