గుడ్లనర్వలో ఘనంగా కబడ్డీ పోటీలు ముగింపు

★ మొదటి బహుమతి 15వేలు సర్పంచ్ లేట్ల బాలస్వామి. రెండవ బహుమతి 7500 కారుకొండ శేఖర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ దసరా పండుగను పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన గుడ్లనర్వ టీమ్ మొదటి స్థానంలో నిలిచి రూ.15,000 నగదు బహుమతిని గెలుచుకోగా, గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి క్రీడాకారులకు బహుమతిని అందజేశారు. రెండవ స్థానంలో నిలిచిన ఖానాపూర్ టీమ్‌కు రూ.7,500 నగదు బహుమతిని కారుకొండ శేఖర్రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి శివ పాల్గొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్లుగా వట్టెం శివకుమార్, లేట్ల వేణు, వట్టెం సందీప్ వ్యవహరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు శ్రీకాంత్, లేట్ల రంజిత్, ధనుంజయ్ కాంత్, రమేష్ నాయక్, వట్టెం చింటూతో పాటు గ్రామ యువకులు వినయ్ రావు, భీమ్ సాగర్, వట్టెం నాగేంద్రబాబు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.