గృహ జ్యోతి పథకంతో లక్ష కుటుంబాలకు లబ్ధి

★ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి

పయనించే సూర్యడు /జనవరి 14/ కాప్రా ప్రతినిధి సింగం రాజు ఉప్పల్ నియోజకవర్గంలో గృహ జ్యోతి పథకం కింద లక్ష కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్రాంతి గ్రీటింగ్స్ అందజేశామని ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన చరిత్ర ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గృహ జ్యోతి, గృహ లక్ష్మి పథకాల కింద లక్ష కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని తెలిపారు. ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్, మహేష్‌నగర్ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి విద్యుత్ శాఖ అధికారులు ఏడీ శ్రీనివాసరెడ్డి, ఏఈ గంగాభవానితో కలిసి లబ్ధిదారులకు నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నుంచి వచ్చిన గ్రీటింగ్స్‌ను పంపిణీ చేశారు. గృహ జ్యోతి పథకానికి అర్హులై నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి, మాడ వెంకటరెడ్డి, మహిపాల్ రెడ్డి, కమలానగర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, కార్యదర్శి పెద్ది నవీన్, సుధాకర్, జలజ, పద్మ, గీతతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.