పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు ఎమ్మిగనూరు కుర్ణి కల్యాణ మండపం లోఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి నిర్వహించిన, గోనెగండ్ల మండల ప్రజల సమస్యల కొరకు పరిస్కారం కొరకు ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్బంగా గోనెగండ్లకు చెందిన టిడిపి నాయకులు ఎన్ వి బాబు నాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్,మాజీ సర్పంచ్ రంగముని, పోలకల్ వెంకటేశ్వర్లు గోనెగండ్ల నుండి తిమ్మప్ప కొండ టూ గువ్వల దొడ్డి అలాగే గోనెగండ్ల టూ గుల్ల మొరుసు గ్రామాలకు బీటి రోడ్డు వేయాలని కోరారు. ఈ రోడ్లలో కొన్ని దశబ్దాలుగా పొలాలకు వెళ్లే రైతులకు, అలాగే గోనెగండ్ల నుండి గువ్వల దొడ్డి, గుల్లమొరుసు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, రోడ్లపై ఎన్నిమార్లు గ్రావెల్ వేయించిన వర్ష కాలంలో రోడ్లు గుంతలు పడి ఎద్దుల బండ్లు, వాహనాలు, ప్రమాదాలు జరిగి చాలామంది గాయలాపాలు అవుతున్నారు. రోడ్డు పక్కన పొలాల రైతులు ఎదురేదురు వెళ్ళాడనికి లేనంతగా రోడ్డును దగ్గరగా జరిపి రస్తాను రైతులు కబ్జాచేసి చాలా ఇరుకుగా చేశారని, ఎమ్మెల్యే బివీ జయ నాగేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మాగ్రామ ప్రజల, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోనెగండ్ల నుండి గువ్వల దొడ్డి, గోనెగండ్ల నుండి గుల్ల మొరుసు గ్రామాలకు రోడ్డు వేసి ప్రజల, రైతుల సమస్యలను తీర్చాలని నాయకులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బివీ కచ్చితంగా ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యుటీ సియం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను కేసుకెళ్లి కచ్చితంగా రోడ్లు మంజూరు. చేసేవిదంగా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షులు మహేళ రహమతుల్లా, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.