గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

★ రూ.40 లక్షలతో పంచాయతీ భవనాల ప్రారంభం ★ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

పయనించే సూర్యుడు జనవరి 14 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:-ఉట్నూర్ మండలంలోని శ్యామనాయక్ తండా మరియు తాండ్ర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ పాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి సహకరించాలని కోరారు గ్రామాల్లోని సమస్యలను స్వయంగా పరిశీలించామని వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరం ఉన్న ప్రతి ప్రాంతంలో బోర్‌వెల్లు వేయిస్తామని తెలిపారు అర్హులైన లబ్ధిదారులందరికీ రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు అలాగే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు చేపట్టి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.