ఘనంగా ముగిసిన సిద్ధాపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

★ విజేతగా మల్లేష్ మహారాజ్ జట్టు రన్నర్ గా జగదంబా జట్టు ★ బహుమతులు అందజేసిన సర్పంచ్ బాసు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. టోర్నమెంట్ విజేతగా మల్లేష్ మహారాజ్ జట్టు రెండవ విజేతగా జగదంబ జట్టు నిలిచింది. గెలుపొందిన జట్లకు గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… యువకులు క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని, తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలని అన్నారు. మొదటి బహుమతి స్పాన్సర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్, రెండో బహుమతి స్పాన్సర్ గా ఉప సర్పంచ్ దొబ్బల యాదయ్య, జెర్సీ స్పాన్సర్ వార్డ్ సభ్యులు కవితా వెంకట్, నరసింహ, నందు, రాజు, కిషన్, మహిపాల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.