జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తాసిల్దార్

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 14 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): సంక్రాంతి సందర్భంగా జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల తాసిల్దార్ కుసరాజు అన్నారు. మంగళవారం రామలింగేశ్వరరావు తో కలిసి ఏలేశ్వరం మండల పరిధిలోని కోడిపందాలు నిర్వహించే పలు అనుమానాస్పద ప్రాంతాలలో ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ కుసరాజు మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు సూచనలతో జంతు హింస నివారణ పై ప్రచారం చేపట్టామన్నారు. సంక్రాంతి గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే కోడిపందాలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిందని, అలాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.సంక్రాంతి సందర్భంగా తమ కుటుంబాలతో ప్రతి ఒక్కరు సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా సూచించారు. ఏలేశ్వరం మండల పరిధిలోని మర్రి వీడు, జె.అన్నవరం, తూర్పులక్ష్మీపురం, లింగంపర్తి, భద్రవరం,పేరవరం, తిరుమాలి,ఎర్రవరం, పెద్దనాపల్లి, సిరిపురం తదితర గ్రామాలలో ప్రజలకు ఫ్లెక్సీల ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ నిషేధించిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.