జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాలు 13వ రోజు తిమ్మాపూర్ లోని ఆర్ టి ఓ ఆడిటోరియంలో డ్రైవర్ లకు రోడ్ ప్రమాదంలో ప్రాథమిక చికిత్స రోడ్ సైన్స్ పై అవగాహన కల్పించిన

* రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్

పయనించే సూర్యుడు జనవరి 14 కరీంనగర్ న్యూస్: జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా నేడు 13వ రోజున ముఖ్య అతిథిగా పాల్గొన్న రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ ఈ సందర్భంగా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ మాట్లాడుతూ రోడ్ల పై ప్రయాణించేటప్పుడు రోడ్ భద్రతా నియమాలను ట్రాఫిక్ నియామలను తప్పకుండా పాటించలనీ కోరారు రహవీర్ ద్వారా గోల్డెన్ హౌర్ లో ప్రాణాలను కాపాడిన వ్యక్తి నీ రాహవీర్ గా గుర్తించి 25,000 రూపాయలు ప్రోత్సాహం అందించి సన్మానం చేసి సత్కరిస్తారు అని తెలియచేశారు వాహన ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఆసరా గా ఉంటుంది అని ఇన్సూరెన్స్ కంపెనీ లు ఆర్థిక పరపైన సహాయం చేస్తాయి అని అందరూ వెహికల్స్ ఇన్సూరెన్స్ తీసుకోవలని కోరారు ఇన్సూరెన్స్ లేని వారికి రోడ్ ప్రమాదం జరిగినప్పుడు 1,50,000 క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలియచేశారు కార్యక్రమం తరువాత ఆర్ టి ఎ మెంబెర్ పడాల రాహుల్ వాహన దారులు డ్రైవర్ లతో రోడ్ భద్రతా ప్రతిజ్ఞ చేయించారు తిమ్మాపూర్ పిఎచ్ సి మెడికల్ ఆఫీసర్ చేత సిపిఆర్ ట్రీట్మెంట్ నేర్పించడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడం పై అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో డిటిసి పురుషోత్తం డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి ఏంవిఐ రవి కుమార్ ఎఏంవిఐ లు స్రవంతి హరిత లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ చారి రోడ్ సేఫ్టీ ఆక్టివిస్ట్ నీలం సంపత్ వాహన దారులు ఆటో మరియు టాక్స్ డ్రైవర్ లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *