పయనించే సూర్యుడు జనవరి 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈసీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జానపద కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన కళాకారుల సంక్షేమ నిధి గురించి వివరించారు. ఇప్పటికే ఐడీ కార్డు కలిగిన ప్రతి కళాకారుడు ఈ సంక్షేమ నిధికి అర్హుడని, అలాగే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కళాకారులందరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పల్లెటూళ్లలో దాగి ఉన్న వివిధ రకాల జానపద కళలను వెలికి తీయడమే సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జానపద కళలకు సముచిత గుర్తింపు, భవిష్యత్ తరాలకు వాటిని పరిరక్షించడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పీ. కృష్ణయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ కోశాధికారి టి. రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. రాములన్న, బొపెల్లి సుల్తాన్.తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు చెన్న కేశవ్, రామకృష్ణ, రవి, మహేష్, భాస్కర్. భరత్, లక్ష్మయ్య. శేఖర్. కేకే గౌడ్. రోజా, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.