తెలుగు సాహిత్య అభివృద్ధికి మాదన్న కృషి మరువలేనిది,,

పయనించే సూర్యుడు. న్యూస్. జనవరి 14 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) ఎమ్మిగనూరు తెలుగు సాహిత్య అభివృద్ధికి టీచర్ మాదన్న కృషి మరువనిదని, తెలుగు సాహిత్య గగనంలో మాదన్న అస్తమించని అక్షర సూర్యుడుగా, వెలుగొందుతున్నారనిమాదన్న మరణం తెలుగు సాహితి లోకానికి తీరని లోటు అని. ఏఐసీసీ. రాష్ట్ర కార్యదర్శి డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు, సాహిత్య వేత్త, అధ్యాపకులు పౌరో హితం మారుతి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు యస్.దేవ సహాయం, దళిత రచయితల సంఘం గౌరవాధ్యక్షులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు. స్థానిక కెవిపిఎస్ ఆఫీసు నందు దళిత రచయితల సంఘం, వ్యవస్థాపక, అధ్యక్షులు, ఉపాధ్యాయులు ఆరెకంటి భాస్కర్ అధ్యక్షతన మాదన్న సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సంస్మరణ సభకు వివిధ సంఘాల ప్రతినిధులు, తెలుగు సాహిత్య ప్రియులు, రచయితలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని మాదన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంస్మరణ సభలో వక్తలు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం, గంజహళ్ళి గ్రామానికి చెందిన పసెద్దుల మాదన్న 30 ఏళ్ళు సుదీర్ఘంగా విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా సేవలందించారని, తెలుగు సాహిత్యం తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం సంఘర్షణతో పరితపించారని,ఆయన కవిత్వాలు, నవలలు, కథలు, పుస్తకాల రచనలు సమాజాన్ని మేలు కొల్పే విధంగా ఉన్నాయన్నారు.నా పంతం మార్చుకోను, నేను అంతం అయినా అక్షర రూపంలో దళిత చైతన్యానికి రవళి నై వస్తా మూగబోయింది నా స్వరమే కానీ. మట్టికి మన్నయింది నా శరీరమే కానీ, సాహితీ ప్రపంచంలో. నేనెప్పటికీ ఆశ నై, భాష నై, ఘోష నై వినిపిస్తూనే ఉంటా నంటుంది మాదన్న, ఆత్మ అని వక్తలు కవిత్వం రూపంలో. అక్షరనివాళులర్పించారూ మాదన్న రాజ్యాంగ పీఠిక పై అమితమైన గౌరవం కలిగి ఉన్న గొప్పవ్యక్తి అని కొనియాడారు. మాదన్న, ఆశయాలను కొనసాగించాలని వక్తలు సాహితీ ప్రియులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో. ఎస్ టి యు, రాష్ట్ర నాయకులు దేవ ప్రసన్న రాజు, బి టి ఏ. జిల్లా అధ్యక్షులు జి. భాస్కర్, టీచర్ అంపయ్య, జనార్ధన్, ఏపీవో సోగనూరు రామన్న, అడ్వకేట్ సుందర రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి మహా దేవ్ మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సుమాల మత్తు, పూలే అంబేడ్కర్ ఐడియాలజీ కన్వీనర్ ఏసి. దేవదానం, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రంగస్వామి, కెవిపిఎస్. నాయకులు అంతోనీ, తిమ్మన్న, మాల రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *