దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు న్యూస్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం దుబ్బాకలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా నూతనంగా ఎన్నికైన దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొంగరి రవి వైస్ చైర్మన్‌గా బొంగరం బాల్ రెడ్డి తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, మీరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్ గుప్తా వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.సహా అన్ని మండలాలకు చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా జిల్లా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు మన ప్రియతమ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కాపాడుతూ వారికి గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని ధిమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి అభినందనలు తెలియజేస్తూ రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు రైతులతో సమన్వయం పెంచుకుని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం మండల అధ్యక్షులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు