నడిగూడెం బిఆర్ఎస్ మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు అనంతుల ఆంజనేయులకు పితృవియోగం

★ అనంతుల అనంతరాములు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం ★ ​ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన నియోజకవర్గ నాయకులు

పయనించే సూర్యడు జనవరి 14 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు బృదవనంపురం గ్రామ నడిగూడెం మండల బిఆర్ఎస్ (టిఆర్ఎస్) సమన్వయ కమిటీ అధ్యక్షులు అనంతుల ఆంజనేయులు గారి తండ్రి అనంతుల అనంతరాములు గారు మరణించడం పట్ల కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మరియు పలువురు మండల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరాములు గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ​మంగళవారం రోజున మృతుడి స్వగృహానికి చేరుకున్న నాయకులు, అనంతరాములు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంతుల ఆంజనేయులును మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ పరామర్శలో మాజీ ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కాసాని ఉపేందర్, ఈకే పేట సర్పంచ్ దొడ్డి నరసింహారావు పుట్టా సీతయ్య, కొవ్వూరి నర్సిరెడ్డి, సొంటి అంజయ్య, సురేష్ బాబు, ఈదయ్య పాల్గొన్నారు. ​అదేవిధంగా రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, బడేటి శ్రీనివాసరావు, కురాకుల కృష్ణమూర్తి, మoడవ నాగమణి, నల్లమాద నారాయణరావు, మాజీ జడ్పిటిసి మారుతి ఉపేందర్, జలీల్, దాసరి శ్రీను, కాసాని శ్రీనివాసరావు, నాగరాజు, వీరబాబు మరియు పలువురు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ​అనంతరాములు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా నాయకులు ప్రార్థించారు