పయనించే సూర్యుడు జనవరి 14 డివిజన్ రిపోర్టర్ దేవరకొండ జిల్లా నల్గొండ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, దేవరకొండ పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి మహిళా సంఘం, యువజన సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీ స్థానిక కోదండ రామాలయం ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. పోటీదారులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, ఆకర్షణీయమైన, సంస్కృతి ఉట్టిపడే ముగ్గులను వేశారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి గెలుచుకున్నవారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ముఖ్యంగా, ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి సభ్యురాలిని ప్రోత్సహిస్తూ, పట్టణ పద్మశాలి మహిళా సంఘం తరఫున జ్ఞాపికగా షీల్డ్‌ను బహుమతిగా అందించారు. పండుగ వాతావరణాన్ని పెంపొందించేలా జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు. న్యాయ నిర్ణేతలుగా కర్నాటి విజయలక్ష్మి, పగిడిమర్రి భార్గవి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు గాజుల ఆంజనేయులు, అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి నాగరాజు, కోశాధికారి గాజుల వినయ్ కుమార్, గౌరవ అధ్యక్షురాలు వనం చంద్రకళ, అధ్యక్షురాలు చేరుపల్లి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గంజి యాదమ్మ, కోశాధికారి సంగీశెట్టి జోత్స్న, సహాయ అధ్యక్షురాలు ఎషాలు అలివేలు, యువజన అధ్యక్షుడు పగిడిమర్రి సతీష్, ప్రధాన కార్యదర్శి మాకం సాయి, కోశాధికారి పున్న శివ, దువ్వ రాజేష్, చిలువేరు సత్యం, వనం శ్రీనివాసులు, జల్దా భాస్కర్, మాకం చంద్రమౌళి, వనం వసంత, గుర్రం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.