పయనించే సూర్యుడు జనవరి 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని-ముదిగొండ మండలాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి కబడ్డీ క్రీడా పోటీలు పాతర్లపాడు గ్రామంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఓబినబోయిన లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపటం అభినందనీయమని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ పెంపొందుతుందని తెలిపారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, యువ క్రాంతి యూత్ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్టులు ఉత్సాహంగా కబడ్డీ పోటీలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి