పేదలకు వరం సీఎం సహాయనిధి : చమర్తి

పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 14: సీఎం సహాయనిది పేదలకు వరమని టిడిపి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి చమర్తి జగన్మోహన్రాజు తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి ఆర్థికంగా చేయూతను ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తూ రూ 5,25,670 ల చెక్కులను 7మంది లబ్ధిదారులకు చమర్తి జగన్ మోహన్ రాజు లబ్ధిదారుల ఇండ్ల వద్దనే అందజేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేద ప్రజల ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం అందజేస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనాన్నిస్తుందని తెలియజేశారు. సీఎం సహాయనిధి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్థిక చేయూత అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముళ్లగూరి సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ మండలాధ్యక్షులు మేడికొండ రవికుమార్ నాయుడు, ఉపాధ్యక్షులు అర్.సతీష్ రాజు, షేక్ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.