ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి

పయనించే సూర్యుడు జనవరి 14 మెట్ పల్లి టౌన్ సమీ యుద్దీన్ పట్టణంలోని 7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జ్ అబ్దుల్ జాకీర్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగరావు కి మరియు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ ని కలిసి వినతిపత్రం అందించారు. పార్టీ తరపున రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశాభావంతో అబ్దుల్ జాకీర్ తన వినతి పత్రాన్ని జువ్వాడి నరసింహారావు ని మరియు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి తన అభ్యర్థిత్వంపై దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ తన తండ్రి గత 45 సంవత్సరాలుగా మెటుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కి సేవలందించారని తెలిపారు. తాను కూడా గత మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అనుభవం కలిగి ఉన్నానని 7వ వార్డు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అబ్దుల్ జాకీర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రజాసేవే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.