పయనించే సూర్యుడు జనవరి 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లురవి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే గ్రామాల్లో బస చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి బిల్లు లేదని, సమస్యలుంటే ఏఈ లేదా ఎస్సీఓ వద్ద దరఖాస్తు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్–3 దశలో ఉన్న ఇండ్లకు బిల్లులు విడుదలవుతున్నాయని, మిగతా దశలకూ త్వరలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కే ప్రజలకు అత్యంత విలువైన శక్తి అని పేర్కొంటూ, ప్రజల ఓటుతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో జి కతలప్ప ఎస్సై శ్రీనివాసులు. బిజినాపల్లి డిప్యూటీ సర్పంచ్ జీ మహేష్. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.