పయనించే సూర్యుడు జనవరి 14 ఎన్ రజినీకాంత్ భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు పటిష్ట భద్రత మధ్య జరుగుతాయనీ ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీబీ కవిత, కాజిపేట్ ఏసిపి ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. అనంతరం డిసిపి మాట్లాడుతూ ఇద్దరు ఏసీపీలు, పదిమంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 350 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత మధ్య వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.. అనంతరం పోలీసులకు వాళ్ళు సూచనలు చేశారు..
