బైకు దొంగతనం చేసిన బేగరి సాయిలు అరెస్ట్

పయనించే సూర్యుడు జనవరి 14 పెద్ద శంకరం పెట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) కడమంచి రాములు తండ్రి పేరు బేగరి బాలయ్య గ్రామము పలువట్ల వట్టిపల్లి మండల్ అను వ్యక్తి జల్సా లకు అలవాటు పడి ఈజీ మనీ సంపాదించుటకు అలవాటు పడి బైకులు దొంగ చేయడం ప్రారంభించాడు గత సంవత్సరం ఏప్రిల్ నెలలో శంకరంపేట్ మార్కెట్ నందు ఫ్యాషన్ ప్రో టిఎస్ 35 బి2482 బైకును దొంగిలించడం జరిగింది అదేవిధంగా నవీపేట్ మండల్ లో గత గత సంవత్సరం జూలైలో ఒక బైకు పంజాగుట్టలో గత సంవత్సరం అక్టోబర్లో ఒక బైకు దొంగతనం చేశాడు ఈరోజు ఉదయం పంజాగుట్టలో దొంగిలించిన బైకు పై అనుమానాస్పదంగా శంకరంపేటలో తిరుగుతుండగా పోలీసులకు పట్టుబడే బైకు కు సంబంధించిన పేపర్లు చూపించమన్నారు పొంతనలేని సమాధానాలు తెలుపగా అతని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా పై దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కష్టానికి పంపడం జరిగింది.