బోధన్ మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి

★ బిఎస్పీ పట్టణ అధ్యక్షులు షైక్ మహ్మద్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 బోధన్: బోధన్ పట్టణంలోని 38వార్డులలో ఓటర్ జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని మంగళవారం రోజున బహుజన సమాజ్ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షులు షైక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో బోధన్ మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న బోధన్ మున్సిపల్ కమీషనర్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా లో ఒకే పేరుతో రెండు ఓటర్ కార్డులు, చనిపోయిన వారివి జాబితా నుండి తొలగించలేదని ఒక వార్డు కు చెందిన వ్యక్తి మరొక వార్డులో చేర్చడం జరిగిందని వాటిని తొలగించి మళ్ళీ తుది ఓటర్ జాబితాను విడుదల చేయాలని లేని యెడల బిఎస్పీ పార్టీ నుండి ఆందోళన కార్యక్రమం చెపడతమని అన్నారు. ఈ కార్యక్రమం లో బహుజన సమాజ్ పార్టీ బోధన్ అసెంబ్లీ అధ్యక్షులు దాడి రమేష్ దాస్, తదితరులు పాల్గొన్నారు.