పయనించే సూర్యడు /జనవరి 14/ కాప్రా ప్రతినిధి సింగం రాజు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్‌లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లేఖల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తమైన గృహ జ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ప్రజలకు భారీ ఊరట కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ ప్రతిమ చౌ, డీఈ సుబ్బారావు, ఏడీ దశరథ్, ఏఈ విజయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లం గట్టయ్య, బొంగోని ఉమేష్ గౌడ్, ఎస్ వి కృష్ణ(కిట్టు), నెమలి అనిల్, పీజీ సుదర్శన్, దంతురి రాజు, ప్రభాకర్ రెడ్డి, జెమిలా బేగం, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగూర బాలరాజ్, వైస్ ప్రెసిడెంట్ జానీ భాయ్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.