మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చేజర్ల మండల కన్వీనర్ బోయళ్ల మాలకొండారెడ్డి సూచనలతో చేజర్లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న యువత. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెట్ట ప్రాంత అభివృద్ది ప్రధాత మా మేకపాటి విక్రమ్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలం నుంచి స్వచ్ఛందంగా 64 మంది రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు