
పయనించే సూర్యుడు ప్రతినిధి సాగర్ జనవరి.14. 2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చొప్పకొండ గ్రామపంచాయతీ చొప్పకొండ గ్రామంలో కోండ్ల దేవా రెడ్డి(మాస్టర్) ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ చొప్పకొండ పంచాయతీ పామూగండీ పంచాయతీ ఈ రెండు పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు ఈ మెగా వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది దేవీపట్నం మండల వైఎస్ఆర్ సీపీ యూత్ కన్వీనర్ శరభవరం & దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ క్రీడలు యువతకు విద్యార్థులకు శరీరక మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయని వీటిని చదువుతో పాటు సమన్వయం చూసుకోవాలని సూచించారు క్రీడల్లో గెలపోటములు సహజమని ముఖ్యంగా క్రమశిక్షణ జట్టు స్ఫూర్తి(టీం స్పిరిట్) అలవర్చుకోవాలని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు యువతకు క్రీడలు అత్యంత ముఖ్యమని అందుకు తగిన ప్రోత్సహం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ సీపీ యువజన నాయకుడు పండా సిద్దార్థ దొర(బి.ఏ ఎల్.ఎల్.బి) మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా యువతను జూదాల నుండి దూరంగా ఉంచి వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడల వైపు మళ్లించేందుకు ప్రోత్సహించాలి అన్నారు ఈ కార్యక్రమంలో కె.అబ్బా రెడ్డి (ఎంపీటీసీ)కె.చిన్నబ్బాయి రెడ్డి(సర్పంచ్) ఎమ్.శ్రీనివాస్ రెడ్డి(పోచమ్మ గండి చైర్మన్) రంపచోడవరం నియోజకవర్గం భారత ఆదివాసి పార్టీ ప్రసార కార్యదర్శి సిహెచ్.సాగర్ కె.బుజ్జి రెడ్డి(పీసా అధ్యక్షులు) కె.శివ కె.బాలకృష్ణారెడ్డి కె.రవీందర్ రెడ్డి సిహెచ్.చిన్న శ్రీనివాస్ రెడ్డి ఎస్.అంబేద్కర్ రెడ్డి కె.సురేష్ రెడ్డి కె.అబ్బాయి రెడ్డి(మైకిల్) ఎమ్.శ్రీను ఆర్. సుధీర్ డి. సుజీ స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థులు యువత యువకులు క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు