పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ, జనవరి- 14 :- మొబైల్ లో సిఎంపిఫ్ బ్యాలన్స్ చూసుకోవచ్చునని కమిషనర్లు హరిపచౌరీ, డాక్టర్ గోవర్ధన్ అన్నారు.మంగళవారం జి.యం కార్యాలయం నందు రామగుండం-3 ఏరియా లోని ఓ.సి-1 ఉపరితల గనిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వాహనాల డ్రైవర్ల కు వారి సియంపిఎఫ్ బ్యాలన్స్ వివరాలను సి- కేర్స్ వెబ్ సైట్ ద్వారా వారి బాలన్స్ వివరాలు వారివారి మొబైల్ ఫోన్ లో చూపించడం జరిగింది. అలాగే వారి బ్యాలన్స్ ఎలా చూసుకోవచ్చునో అవగాహన కల్పించారు.వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ లొనే మొట్ట మొదటిసారిగా రామగుండం-3 ఏరియాలో కాంట్రాక్టు డ్రైవర్ల కోసం చేసిన ప్రయత్నం ఫలించినదని అందుకు సహకరించిన అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే విధంగా అన్ని ఏరియాల్లో చేయడం జరుగుతుందిదని తెలిపారు.బ్యాలన్స్ చూసుకోవడాని ఇక ముందు పాస్ బుక్ చిట్టీ అవసరం లేకుండా ఎప్పుడైనా వారి, వారి బ్యాలన్స్ అమౌంట్ ఫోన్ లో చూసుకోవచ్చని అన్నారు.కార్యక్రమంలో ఎస్వోటుజియం యం.రామ్మోహన్, పర్సనల్ విభాగపతి సుదర్శనం, డివై పియం సునీల్ ప్రసాద్, ఫైనాన్స్ విభాగం అధికారి భరత్, సిబ్బంది అనిత, కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు.