పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మన్నూరు యల్లమ్మ ఆలయం సమీపంలోని యల్లటూరు భవన్ నందు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలు ప్రారంభించారు. చెడు అంతం కావాలని భోగి మంటలు వెలిగించారు. పాడి పశువులను పూజించి అన్నదాతల సేవలను కొనియాడారు. అనంతరం అనేక రంగాలలో సేవలందించిన సంఘ సేవకులు, పెద్దలు, ఉపాధ్యాయులు, మిలటరీ, క్రీడాకారులు, మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. శ్రీనివాసరాజు ఎండ్ల బండి పై స్వారీ చేస్తూ పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరిస్తూ భావితరాలకు సంక్రాంతి గొప్పతనం తెలిసేలా ముందస్తు వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.