పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, జనవరి-14 న్యూ మారేడుపాక 20వ,డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు డివిజన్ అధ్యక్షులు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్మించిన సిసి రోడ్లపై ముగ్గులు వేసి సంబరాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి పోటీలో విజేతల కు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా గుండేటి మాట్లాడుతూ.. మన సాంప్రదాయాలను కాపాడుతూ రంగ రంగ వైభవంగా ముగ్గుల పోటీలలో పాల్గొని చక్కగా ముగ్గులు వేసిన మహిళా సోదరీమణులందరికీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక తెలిపారు. కార్యక్రమంలో నరేష్ మహిళలు పాల్గొన్నారు.
