పయనించే సూర్యుడు జనవరి 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలో విద్యుత్ డివిజన్, సబ్ డివిజన్ మార్పులు జరిగాయని మధిర-బోనకల్ విద్యుత్ శాఖ ఏడి ఆనంద్, చింతకాని ఏఈ చావా శ్రీధర్ తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ కొరకు మీసేవలో దరఖాస్తు చేసే వినియోగదారులు ఇప్పటివరకు ఖమ్మం డివిజన్, పెద్దగోపతి సబ్ డివిజన్ గా దరఖాస్తు చేసుకునే వారిని, ఇకపై మధిర డివిజన్, బోనకల్ సబ్ డివిజన్ గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చింతకాని మండలాన్ని మధిర సబ్ డివిజన్ కు మార్చడం వలన ఈ మార్పులు అమలులోకి వచ్చాయని వారు తెలిపారు. విద్యుత్కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వినియోగదారులు ఈ క్రింది మార్గాలను వినియోగించుకోవచ్చు అని పేర్కొన్నారు. సంప్రదింపు వివరాలు, టోల్ ఫ్రీ నెంబర్: 1912, విద్యుత్ శాఖ వాట్సాప్ నెంబర్: 7901628348, టి జి ఎన్ పి డి సి ఎల్ యాప్ ద్వారా కన్జ్యూమర్ గ్రీవెన్స్. ఈ మార్పులను చింతకాని మండల విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు