పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 14(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) :ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వివేకనంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాత, చిన్నశంకర్లపూడి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అమోఘమని, ఇంకా మారుమూల గ్రామాలలో రక్తదానం చేయడం వల్ల మనుషులు పాడైపోతారని అపోహ నమ్మవద్దని రక్త దానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యుడు పెండ్యాల రాజు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి అంటే యూత్ డే గా పిలవడం జరుగుతుందని, మా సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని, రక్తదాన శిబిరాలు చాలాసార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది రక్తం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ రవికుమార్ వర్మ, కూటమి నాయకులు జ్యోతుల పెదబాబు, బస్స ప్రసాద్, పెంటకోట మోహన్, మైరాల కనకారావు, గంగిరెడ్ల మణికంఠ, తోట గోపాలకృష్ణ, వివేకానంద సేవాసమితి సభ్యులు శివప్రసాద్, సారా శీను, పెండ్యాల రాజు,వెంకటరమణ, హెచ్ఎం కన్నబాబు, తదితర కూటమి నాయకులు, సేవా సమితి, సంజీవిని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.