వైద్య ఆరోగ్యశాఖ మినిస్ట్రియల్ ఫోరం క్యాలెండర్ ఆవిష్కరణ

★ మినిస్ట్రీయల్ ఫోరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు జనవరి 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మినిస్ట్రీయల్ ఫోరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణను సమీకృత భవనంలో జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్ మినిస్ట్రీయల్ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్,విజేందర్ సంయుక్తంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మినిస్ట్రియల్ ఫోరం నూతన కమిటీ మంగళవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు సంఘ కార్యక్రమాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్ కార్యదర్శి షర్ఫుద్దీన్, డిఎన్జీవో వివిధ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, ఫోరం కమిటీ సభ్యులు నదీమ్, భరత్, చెన్న కేశవ్, పి.కృష్ణయ్య, నాగయ్య, అవనిజా, భాగ్యలక్మి, పార్వతమ్మ,కళ్యాణ్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.