పయనించే సూర్యుడు జనవరి 14 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాలింగార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్తుల సౌభాగ్యం కోసం అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య లక్ష మారేడు దళాలతో స్వామివారికి అర్చన చేశారు. శివలింగానికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
