పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ- జనవరి-14:- భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అఖిల భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తున్న సత్య సాయి ప్రేమ వాహిని రథయాత్ర తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలలో ప్రారంభమై సోమవారం రాత్రి పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చేరుకొని మంగళవారం ఉదయం భక్తుల సందర్శనార్థం కల్వచర్ల, సెంటనరికాలనీ పురవీధుల గుండా ప్రయాణించగా భక్తులు మంగళహారతి, పూలు, పూలమాలతో స్వాగతించి, టెంకాయలు, పండ్లు ప్రసాదాలు సమర్పించి సత్యసాయి బాబా ఆశీస్సులు పొందారు. 8వ కాలనీ సత్య సాయి సేవా సంస్థ సమితి కన్వీనర్ నూక రమేష్ ఆధ్వర్యంలో సింగరేణి అడ్రియాలా ప్రాజెక్ట్స్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వర్ రావు దంపతులు మొదటి టెంకాయ కొట్టి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థల జిల్లా కార్యవర్గం, సభ్యులు, సమితి కన్వీనర్లు, భజన మండలి, భక్తులు, పెద్దలు, మహిళలు కోలాటంతో, పిల్లలు స్వామివారి సందేశాల ప్లే కార్డుల ప్రదర్శనలు, బాజా భజంత్రీలతో పాల్గొని బయలుదేరగా, నిర్వాహకులు స్వామివారి పటాలు, పుస్తకములు, విభూది, పులిహోరలను భక్తులకు ప్రసాదంగా అందించారు.