సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్

పయనించే సూర్యుడు, జనవరి 14, బూర్గం పాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా సారపాక గ్రామ పంచాయితీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ గ్రామస్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగల ఉత్సవాత్మక వాతావరణంలో గ్రామ ప్రజలతో కలిసి ఆయన పండుగను జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, సారపాకలో డ్రైనేజీ సమస్యలు మరియు రోడ్ల మరమ్మత్తు సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. "గ్రామంలో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే మా ప్రాధాన్యత. డ్రైనేజీ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసేలా, రోడ్లు మెరుగ్గా ఉండేలా త్వరలోనే చర్యలు తీసుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు.గ్రామస్తులు సర్పంచ్ హామీపై సంతోషం వ్యక్తం చేస్తూ, మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు.