సర్పంచిగా పెరిక నాగేశ్వరావు గెలుపు పట్ల మొక్కు చెల్లించుకున్న మొక్కా సైదులు

★ పెరిక నాగేశ్వరావు. దంపతులు మొక్క సైదులు దంపతులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 14, తల్లాడ రిపోర్టర్ తల్లాడ సర్పంచ్ గా పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి) విజయం సాధించడం పట్ల తల్లాడ వాలీబాల్ స్టేట్ ప్లేయర్ మొక్కా సైదులు, పుష్పావతి దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం తల్లాడలోని శివాలయంలో నూటోక్క కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు సర్పంచ్ నాగేశ్వరరావు, సుభద్ర దంపతులు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరూ కలిసి కుటుంబ సమేతంగా స్వామి వారికి పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మొక్క సైదులు మాట్లాడుతూ సర్పంచిగా గెలిస్తే ముక్కు చెల్లించుకుంటానని అనుకున్నానని, దాని ప్రకారం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.