పయనించే సూర్యుడు : జనవరి 14 : హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో విశిష్ట సేవలు గుర్తించి వారికి రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం ప్రదానం చేశారు. మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ అవార్డుకు ఎంపిక చేయగా అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతి హాల్లో పలు సంస్థల వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ మరియు అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు గ్రహీత కదరి వెంకటరమణరావు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మరియు డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, ఫిలిం ఆర్టిస్ట్ ఐశ్వర్య, డాక్టర్ పి.ఝాన్సీ రాములు శాలువాతొ సత్కరించి, సర్వోత్తమ సేవ పురస్కారం అవార్డును ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథి కోలేటి దామోదర్ గుప్త దైవజ్ఞశర్మ డాక్టర్ శివ నాగార్జున రెడ్డి లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మండల యాదగిరి పత్రికా రంగంలో అందిస్తున్న నిస్వార్థ సామాజిక సేవలు వెలకట్టలేనివని, వృత్తిపరంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సమాజ శ్రేయస్సు లక్ష్యంగా సేవ దృక్పథంతో ఎలాంటి స్వార్ధాన్ని ఆశించకుండా తమ వంతు పాత్రను సమాజంలో భాగస్వాములై ఆదర్శప్రాయంగా నిలుస్తున్నందుకు రాష్ట్రస్థాయి అవార్డు తో సత్కరించడం జరిగిందన్నారు. మానవత విలువలు పెంపొందించే దిశగా అహర్నిశలు కృషి చేయాలని, ప్రజల, ప్రభుత్వం వద్ద గుర్తింపు పొంది మరెన్నో అవార్డులు, రివార్డులు సత్కారాలు పొందాలని నిరంతర తత్పరులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.