సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు విస్తరణ గురించి ఏం ఎల్ ఏ పాయం కి వినతి

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 14: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశ్ రావు కలిసి ఎప్పుడో కావలసిన అశ్వాపురం మెయిన్ రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం అయినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. అశ్వాపురం ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతము కావటం రోడ్డు మీద నుండి నిత్యం వందలాది వాహనములు అనగా లారీలు, బస్సులు, పరిశ్రమలకు సంబంధించిన హెవీ గూడ్స్ వెహికల్స్, ద్విచక్ర వాహనములు, భారజల కర్మాగారం ఉద్యోగులు మరియు వారి వాహనములు, మరియు ఆటోలు వీటి మూలాన తరచుగా ప్రమాదాలు తరచుగా ఆ జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఎందరో కావున మంచి కంటి నగర్ నుంచి ఆర్ అండ్ బి ఆఫీస్ వరకు. ఫారెస్ట్ ఆఫీస్ నుండి చింతిర్యాల క్రాస్ రోడ్ వరకు డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సుమారు పదిహేనువందల మీటర్లు దూరం ఉన్నందున అదనంగా అనుమతులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.