పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 14,2026, వాంకిడి, కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. జిల్లా కేంద్రం లోని 108 అంబులెన్స్ లను మంగళవారం రోజున ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అంబులెన్స్ లోని మెడికల్ ఎక్యుప్మెంట్ ల పనితీరును మరియు మెడిసిన్ లను తనిఖీ చేయడం జరిగినది. మూడు నెలల రికార్డ్స్ లను చూడడం జరిగినది. సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగినది, 108 కు ఫోన్ రాగానే తక్షణమే స్పందించాలని, ఎక్స్పైరీ మెడిసిన్ లను నెల ముందే తీసివేయాలని చెప్పడం జరిగినది. ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లు ప్రవీణ్ యాదవ్, పరుశురాం, పైలెట్లు కొమరయ్య విలాస్ లు ఉన్నారు.