పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలె మనీషా -రాజేష్ బాబు,మాజీ సర్పంచ్ బాలె శోభ రాణి, మాజీ ఎంపీటీసీ బాలె చంద్ర శేఖర్,మాజీ ఎంపీటీసీ మోర విజయలక్ష్మి వెంకటేష్, పురోహితులు శ్రీమాన్ నంబి వాసు దేవ్, సురేందర్, భక్తులు అధిక సంఖ్యలో పాలుగోనారు