పయనించే సూర్యుడు జనవరి 15 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మట్ వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు గ్రామాల్లో ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.