
పయనించే సూర్యుడు న్యూస్. జనవరి 15 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఆదోని పట్టణంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదోని డిఎస్పీ పర్యవేక్షణలో ట్రాఫిక్ సిఐ అబ్దుల్ గౌస్ తన సిబ్బందితో కలిసి ప్రధాన కూడళ్లలో వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చలానాలను ఆన్‌లైన్ ద్వారా తనిఖీ చేసి, వాటిని తక్షణమే చెల్లించాలని వాహనదారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తూనే, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని సిఐ అబ్దుల్ గౌస్ కోరారు.